ACTION | మైనర్ బాలుడు ట్రాక్టర్ నడిపిస్తున్న దృశ్యం

ACTION | మైనర్ బాలుడు ట్రాక్టర్ నడిపిస్తున్న దృశ్యం

  • ఒకరి విధి నిర్వహణ.. మరొకరు మైనర్ ట్రాక్టర్ నడుపుతున్న దృశ్యం

ACTION | వికారాబాద్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికుని స్థలంలో అతని కొడుకు విధి నిర్వహిస్తూ ట్రాక్టర్ నడిపిస్తున్న దృశ్యం వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నర్సాపూర్ గ్రామంలో కనిపించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ధరూర్ మండలం నర్సాపూర్ గ్రామపంచాయతీకి సంబంధించి పారిశుద్ధ్య పనుల కొరకు నియమించిన బీర్ల మల్లేశం తన సొంత పనులు చేసుకుంటూ తన కొడుకు మైనర్ అబ్బాయిని ట్రాక్టర్ (Tractor) నడిపిస్తూ ఉండుట గ్రామ యువకులు గమనించి పంచాయతీ సెక్రెటరీ రేఖ గౌడ కు తెలియజేయడం జరిగితే మేము అట్లనే చేస్తాం ఎవరికి చెప్తారో వాళ్లకు చెప్పుకోండి అని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. కనుక సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అధికారులు వెంటనే చర్య తీసుకొని సర్పంచ్ పై గ్రామపంచాయతీ సెక్రటరీ పై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. లేనిపక్షంలో వికారాబాద్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయవలసి వస్తుందని గ్రామస్తులు హెచ్చరించారు.

Leave a Reply