Drunk and drive | వాహనాల తనిఖీ చేసిన పోలీసులు

Drunk and drive | వాహనాల తనిఖీ చేసిన పోలీసులు
- సరైన పత్రాలు లేని 18 వాహనాలకు 1800, జరిమానా
- మైనర్ యువకులకు వాహనాలు ఇవ్వకూడదని సూచన
- హెల్మెట్ బరువు కాదు ఇది మీ బాధ్యత
- రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరి పాటించాలి: ఎస్పై సిహెచ్ తిరుపతి
Drunk and drive | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్ సమీపంలో శనివారం ఎస్పై సి.హెచ్ తిరుపతి సిబ్బంది తో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పై మాట్లాడుతూ, వాహనాల తనిఖీలు డ్రంక్ టెస్ట్ చేయగా ఒకరిపై డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and drive) కేసు నమోదు చేయడం జరిగిందని హెడ్ కానిస్టేబుల్ అశోక్ తెలిపారు.
ద్విచక్ర వాహన దారులు హెల్మెట్, నంబర్ ప్లేట్ లేకుండా మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట రీత్య చర్యలు తీసుకుంటామని ఎస్పై అన్నారు.నూతన చట్టాలను వాహనదారులు నిబంధనలను పాటిస్తూ వాహనాలు నడిపి ఇవ్వాలని అన్నారు. ద్విచక్ర వాహనం త్రీ, ఫోర్, సిక్స్, విల్లర్, వాహన దారులు సంబంధించిన పత్రాలు ఎప్పుడు వెంటే ఉంచుకొని ప్రయాణం చేయాలన్నారు. ఇక నుండి వాహన దారులు ట్రాఫిక్ నిబంధనల(traffic rules)ను పాటించి పోలీసులకు సహకరించాలని అన్నారు.
అలాగే డ్రైవింగ్ లైసెన్స్(driving license) లేకుండా వాహనాలు నడిపితే వాహనాలు ఇచ్చిన వారి పై నడిపించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు.అలాగే వాహనా నికి సంబంధిం చిన సరైన పత్రాలు లేని 18వాహనాలకు 1800/- రూపాయల జరిమానా విధించినట్టు ఎస్పై తెలిపారు. ఈ వాహనాల తనిఖీలు సిబ్బంది దయానంద్, గోపాల్, మంగీలాల్ ఉన్నారు.
