EX MLA | శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న…

EX MLA | శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న…
- ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే
EX MLA | ఇటిక్యాల, ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని పెద్దదిన్నె గ్రామంలో శ్రీ స్వయంభు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఏఐసీసీ కార్యదర్శి, అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్. ఎస్.ఏ.సంపత్ కుమార్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఉన్నారు. ముందుగా ఆలయ అర్చకులు, చైర్మన్లు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. చైర్మన్ జయసింహ, అర్చకులు సంపత్ కుమార్ కు తీర్థప్రసాదాలు అందజేసి ఆయనతో పాటు పాల్గొన్న జిల్లా గ్రంధాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, వివిధ గ్రామాల సర్పంచులకు నాయకులకు శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గ్రామ సర్పంచ్ సుజాత మదిలేటి, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
