Suman | ట్రస్టు బోర్డు చైర్మన్ కు హీరో సుమన్ అభినంద‌న‌…

Suman | ట్రస్టు బోర్డు చైర్మన్ కు హీరో సుమన్ అభినంద‌న‌…

  • దేవస్థానం అభివృద్ధికి కృషి ప్రశంసనీయం…

Suman | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో అభివృద్ధికి చేపట్టిన పలు అంశాలపై ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడును ప్రముఖ సినీ హీరో సుమన్ ఇవాళ‌ అభినందించడం జరిగిందన్నారు. మండలి చైర్మన్ సినిమా హీరో సుమన్ ను మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి వస్త్రం, ప్రసాదం అందజేయడం జరిగిందన్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ… శ్రీశైల క్షేత్రంలో చెంచు గిరిజనులకు స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం కల్పించండం ఒక చారిత్రక నిర్ణయమ‌న్నారు. చైర్మన్ కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని, హిందూ ధర్మం సనాతన ధర్మం పట్ల ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండి ఆచరించాలని తెలిపారు. నంద్యాల జిల్లాలో పలు ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రతి దేవాలయంలో సనాతన ధర్మంను ఆచరించ‌డంతో పాటు భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలను సందర్శించడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందన్నారు.

Leave a Reply