Celebrations | ఎమ్మెల్యే కార్యాలయంలో వేడుకలు

Celebrations | ఎమ్మెల్యే కార్యాలయంలో వేడుకలు
- న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, కూటమి నాయకులు

Celebrations | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డలోని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్‌లకు అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ, ఆర్‌డబ్ల్యూఎస్ అండ్ ఎస్‌డీఈఈ బీహెచ్‌డీ ప్రసన్న, ఏఈఈలు భోగాది జగత్, కిషోర్ బాబు, ఇరిగేషన్ శాఖ డీఈఈ బీబీఎస్ గణపతి, ఏఈఈలు విన్నకోట రామ్ కుమార్, పొన్నూరు రవితేజ, దోవారి విజయ్ కుమార్, తానేటి ప్రసాద్, పంచాయతీ రాజ్ ప్రాజెక్ట్స్ డీఈఈ మోషేస్, ఏఈఈ భరద్వాజ, ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ కే.హనుమంతరావు, డిపో అధికారులు, కోడూరు ఎస్ఐ చాణక్య, ఏఓ కే.మురళీకృష్ణ, సిబ్బంది, ఘంటసాల ఎంపీడీఓ డీ.సుబ్బారావు, సిబ్బంది, కోడూరు ఇన్‌చార్జి తహసీల్దార్ జే.సౌజన్య కిరణ్మయి, సిబ్బంది, కోడూరు ఎంఈఓ టీవీఎం రామదాసు, నాగాయలంక ఎంపీడీఓ చంద్రశేఖర్, సిబ్బంది తదితరులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.









