Physical Endurance | క్రీడలతో శారీరక మానసికోల్లాసం

Physical Endurance | క్రీడలతో శారీరక మానసికోల్లాసం
Physical Endurance | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : క్రీడలతో ఆరోగ్య అవగాహనను పెంచడం ద్వారా శారీరక దారుఢ్యం మెరుగుపడుతుందని భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడలు మంత్రిత్వ శాఖ మేర యువ భారత్(A young India) డీడీ కె. వెంకట్ ఉజ్వల్ అన్నారు. ఈ రోజు కోడి రామ్మూర్తి స్టేడియంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు.
ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న యువజన సర్వీసులు శాఖ సెటశ్రీ సిఈఓ సి.ఇ.ఒ వి.వి.అప్పలనాయుడు(CEO CEO VV Appalanaidu) పాల్గొని క్రీడా పోటీలు ప్రారంభించారు. బహుమతి ప్రధాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఉపాధి కల్పన అధికారిణి కె.సుధ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండి గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, సామర్థ్యాలను మెరుగుపరచుకుంటూ విజయ బావుటాను ఎగురవేయాలన్నారు.
క్రీడా పోటీలు అంటే శారీరక శ్రమ, నైపుణ్యాలు కలిగిన వ్యవస్థీకృత పోటీలు వినోదాన్ని అందిస్తాయని, క్రీడాకారులకు ఆనందాన్ని కలిగిస్తాయని తెలిపారు. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, జట్టు స్ఫూర్తిని పెంపొందిచడానికి, క్రమశిక్షణ నేర్పడానికి ముఖ్యమైనవన్నారు.
మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టరు కె.వెంకట్ ఉజ్వల్ మాట్లాడుతూ, మందస, కోటబొమ్మాళి, నరసన్నపేట, గార (శ్రీకాకుళం) బ్లాక్స్ యందు కోకో (మహిళలు), వాలీబాల్, (పురుషులు) బ్యాడ్మింటన్ (ఆడ, మగ), అథ్లెటిక్స్(ఆడ, మగ), నిర్వహించి బ్లాక్ లెవల్ గెలుపొందిన వారు ఈ రోజు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్నారని, క్రీడల ద్వారా ఆరోగ్య అవగాహనను పెంచడం, శారీరక దారుఢ్యం(Physical Endurance) మెరుగుపడుతుందని చెప్పారు.
క్రీడలు కండరాలను బలోపేతం చేస్తాయని, రోగనిరోధక శక్తిని పెంచుతాయన్నారు. శరీరానికి మంచి శారీరక ఆరోగ్యాన్ని అందిస్తాయన్నారు. జిల్లా క్రీడాకారి అభివృద్ధి అధికారి ఎ.మహేష్ బాబు మాట్లాడుతూ క్రీడలు ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయని, మానసిక ఆనందాన్ని పెంచుతాయని అన్నారు.
గెలుపొందిన క్రీడాకారులకు అతిధులుచే బహుమతులు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎన్.నారాయణరావు, జిల్లా నైపుణ్య అభివృద్ది అధికారి ఉరిటి సాయికుమార్, మేరా యువ భారత్ గణంకాధికారి, కార్యక్రమ సహాయకులు డి.శ్రీనివాసరావు, క్రీడా కోచ్ లు మణి, సింహాచలం, హరి, మేరా యువ భారత్ వాలంటీర్స్(Volunteers) అరుగుల దిలీప్ కుమార్, మట్ట ప్రియాంక, మౌనిక, కొయ్యాన మధు, బాలాజీ, యూత్ లీడర్స్ గుజ్జల ఉమామహేశ్వరరావు, రౌతు సుమతి, మోహనరావు క్రీడాకారులు, యువతీయువకులు ఉత్సాహంగా పాల్గన్నారు.
