AP | నూతన సంవత్సర వేడుకలు..

AP | నూతన సంవత్సర వేడుకలు..

AP, కర్నూలు, ఆంధ్రప్రభ : నూతన సంవత్సరం – 2026 సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. యువత ఉత్సాహంతో రోడ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలకు గురికాకూడదని సూచించిన ఎస్పీ, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయం, కొండారెడ్డి బురుజు వద్ద జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కేక్ కట్ చేసి పోలీసు అధికారులకు, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలంతా క్షేమంగా, సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, కర్నూలు పట్టణ సీఐలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శాంతి భద్రతలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply