MLA | సమస్యలు పరిష్కరిస్తాం..

MLA | సమస్యలు పరిష్కరిస్తాం..
- ప్రజాదర్బార్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
MLA | మైలవరం, ఆంధ్రప్రభ : ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం కృషి చేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదేశించారు. ప్రజాసేవల్లో నాణ్యత, పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలన్నారు. మైలవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ప్రజదర్బార్ నిర్వహించారు. ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న వినతులను ఎమ్మెల్యే స్వీకరించారు. సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వివిధ సమస్యలపై 65 మంది అర్జీలను సమర్పించారు.



