Nirmal | ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

Nirmal | ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
- దేవరకోట వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు
Nirmal | నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ వేకువజాము నుండి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకుంటున్నారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వారి సతీమణి అల్లోల విజయలక్ష్మి దేవరకోటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే ఆలయంలో నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. దేవాలయ చైర్మన్ ఆ మెడ శ్రీనివాస్, ఈవో, ఆలయ ధర్మకర్తలు కోటగిరి శ్రీధర్, దేవేందర్ గౌడ్, సంతోష్, రమేష్, వివిధ ధార్మిక సంఘ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
