AP Cabinet | కన్నీటి పర్యంతమైన మంత్రి రాంప్రసాద్

AP Cabinet | కన్నీటి పర్యంతమైన మంత్రి రాంప్రసాద్

AP Cabinet | అమరావతి: అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మార్చే నిర్ణయంపై ఏపీ (AP) మంత్రివర్గ సమావేశంలో భావోద్వేగ దృశ్యం చోటుచేసుకుంది. రాయచోటి ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి రాంప్రసాద్ రెడ్డి ఈ నిర్ణయంపై కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనను ఓదార్చారు.

సమావేశంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడుతూ… జిల్లా కేంద్రం మార్చకుంటే తలెత్తే సాంకేతిక ఇబ్బందులను వివరించారు. అయినప్పటికీ రాయచోటి అభివృద్ధిని తాను ప్రత్యేకంగా చూసుకుంటానని మంత్రి రాంప్రసాద్ రెడ్డికి హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాయచోటి కేంద్రంగా ఉన్న జిల్లా పరిధిని మార్చే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ భావోద్వేగ దృశ్యం చోటుచేసుకుంది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నిర్ణయంపై సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.

Leave a Reply