Lenin | లెనిన్ కథ ఇదే..

Lenin | లెనిన్ కథ ఇదే..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అక్కినేని అభిమానులు అఖిల్ బ్లాక్ బస్టర్ సాధిస్తే.. చూడాలని ఎప్పటి నుంచో ఆతృతగా(eagerly) ఎదురు చూస్తున్నారు. అయితే.. అఖిల్ నుంచి సినిమా రావడం లేదు.. అలాగే బ్లాక్ బస్టర్ రావడం లేదు.. దీంతో ఎప్పుడెప్పుడు అఖిల్ అభిమానులు ఆశించిన విజయం సాధిస్తాడా అని చకోర పక్షుల్లా(Like birds of prey) ఎదురు చూస్తున్నారు. అయితే.. ప్రస్తుతం అఖిల్ లెనిన్ మూవీ చేస్తున్నాడు. సైలెంట్ గా షూటింగ్ జరుగుతుంది కానీ.. అఫిషియల్ గా ఎలాంటి అప్ డేట్ లేదని ఫ్యాన్స్ వెయిటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ.. ఏంటా గుడ్ న్యూస్..?
Lenin | తొలి సక్సెస్..

అఖిల్ మూవీతో తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించాలి(To achieve success) అనుకున్నాడు కానీ.. నిరాశే ఎదురైంది. ఆతర్వాత అఖిల్ నటించిన హలో, మిస్టర్ మజ్ను సినిమాలు కూడా నిరాశపరిచాయి. ఆఖరికి అఖిల్ తొలి సక్సెస్ సాధించడం కోసం.. నాలుగవ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వరకు వెయిట్ చేయాల్సివచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్(Directed by Bommarillu Bhaskar) లో రూపొందిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో.. యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించారు. ఇందులో అఖిల్ కు జంటగా క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే(Pooja Hegde) నటించింది. ఈ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ సాధించవచ్చు అని ఏజెంట్ మూవీ చేస్తే.. అది బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది.
Lenin | లెనిన్ వేరే లెవల్..

అక్కినేని అఖిల్ హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు(Murali Kishore Abbur) తెరకెక్కించిన చిత్రం లెనిన్. ఈ భారీ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆమధ్య ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ అయితే.. వేరే లెవల్లో ఉంది. సినిమా పై అప్పటి వరకు ఉన్న అంచనాలను మరింతగా పెంచేసింది. అయితే.. డివోషనల్ టచ్ తో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న సినిమా ఇది. రాయలసీమ బ్యాక్ డ్రాప్(Rayalaseema backdrop) లో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ న్యూయర్ లో రిలీజ్ చేస్తామని నిర్మాత నాగవంశీ తెలియచేశారు. అంతే కాకుండా.. ఈ క్రేజీ మూవీని మార్చిలో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో లెనిన్ అప్ డేట్ వైరల్(The update is viral) అయ్యింది. మరి.. లెనిన్ తో అయినా అఖిల్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.
