ఐపీఎల్‌లో ప్లే-ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో… ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కెఎల్ రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్ తన సెంచరీతో అదరగొట్టాడు.
మరోఎండ్ లోని బ్యాటర్లు తడబడుతున్న వేళ రాహుల్ మాత్రం నిలబడ్డాడు. ఆచితూచీ ఆడుతూ.. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. హాఫ్ సెంచరీ చేశాక రాహుల్ మరింత దూకుడుగా ఆడిన కేఎల్.. మరో 25 బంతుల్లోనే 50 నుంచి 100 పరుగుల మార్కుకు చేరుకున్నాడు. చివరకు కేఎల్ రాహుల్.. 65 బంతుల్లో 112 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల నష్టానికి 199 రన్స్ స్కోరు చేసింది.
దీంతో 200 పరుగుల టార్గెట్ తో గుజరాత్ టైటాన్స్ ఛేజింగ్‌కు దిగింది.