Cricket Tournament | క్రీడాస్ఫూర్తి పెంపొందాలి..

Cricket Tournament | క్రీడాస్ఫూర్తి పెంపొందాలి..

  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

Cricket Tournament | ఆంధ్రప్రభ, నందిగామ : నందిగామ పట్టణం పరిధిలోని నందిగామ, అనాసాగరం బైపాస్ రోడ్డులో నందిగామ–జగ్గయ్యపేట నియోజకవర్గాల స్థాయిలో వంగవీటి మోహనరంగా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి, కూటమి నేతలు పాల్గొన్నారు.

Leave a Reply