Tribal Families | ‘మీ ఇంటికి… మీ డాక్టర్’…

Tribal Families | ‘మీ ఇంటికి… మీ డాక్టర్’…

  • గిరిజన చెంచు కుటుంబాలకు..
  • అందుబాటులో మొబైల్ హెల్త్ క్లినిక్ సేవలు..
  • వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, డ్రైవర్ల పోస్టులకు ఆహ్వానం..

Tribal Families | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని గూడేలలో నివసిస్తున్న నిరుపేద చెంచు గిరిజన కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ‘మీ ఇంటికి… మీ డాక్టర్’ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు జి. రాజకుమారి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఏపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో, న్యూఢిల్లీకి చెందిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఫౌండేషన్ (REC Foundation) ఆర్థిక సహకారంతో జిల్లాలో అమలు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.

Tribal Families

వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ అధ్యక్షులైన గవర్నర్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించనున్నారన్నారు. ఈ ప్రాజెక్టును జిల్లాలో రూ.1.20 కోట్ల వ్యయంతో మూడు సంవత్సరాల పాటు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా చెంచు కాలనీల్లో నివసిస్తున్న ప్రజలకు మొబైల్ హెల్త్ క్లినిక్స్ ద్వారా ఇంటి వద్దకే ప్రాథమిక వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ (GOVT) ఆరోగ్య వ్యవస్థ సమన్వయంతో మొబైల్ హెల్త్ క్లినిక్స్‌ను నిర్వహించి ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టు పని చేస్తుందని కలెక్టర్ తెలిపారు. మాతా – శిశు మరణాలను తగ్గించడం, సంక్రమణ వ్యాధుల నియంత్రణ, ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల్లో నూరు శాతం టీకాల కవరేజీ సాధించడం, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన వైద్య పర్యవేక్షణ అందించడం వంటి అంశాల పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఆమె వివరించారు. ఈ మొబైల్ హెల్త్ క్లినిక్ నిర్వహణ నిమిత్తం డాక్టర్, నర్స్, ఫార్మసిస్ట్, డ్రైవర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

Tribal Families

పోస్టుల వివరాలు : అర్హతలు – వేతనాలు..

డాక్టర్ : ఎంబీబీఎస్ లేదా ఎండీ పూర్తి చేసి ఉండాలి. నెలవారీ వేతనం – రూ.80,000/-
నర్స్ : జీఎన్ఎం / బీఎస్సీ నర్సింగ్ అర్హత ఉండాలి. నెలవారీ వేతనం – రూ.25,000/-
ఫార్మసిస్ట్ : బీ.ఫార్మసీ / డిప్లొమా ఇన్ ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి. నెలవారీ వేతనం – రూ.18,000/-
డ్రైవర్ : హెవీ వాహనాలు నడిపేందుకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కనీసం ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. నెలవారీ వేతనం – రూ.18,000/- ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటాతో కూడిన దరఖాస్తులను redcrossnandyal@gmail.com, redcrossap@gmail.com ఈమెయిల్ చిరునామాలకు 2026 జనవరి 15 లోపు పంపాలని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు రాజకుమారి తెలిపారు.

CLICK HERE TO READ పేదల కోసం..

CLICK HERE TO READ MORE

Leave a Reply