సాంకేతిక విజ్ఞానంతోనే దేశాభివృద్ధి..

  • ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ తాహెరా సుల్తానా

ఆంధ్రప్రభ, విజయవాడ : దేశం అభివృద్ధి చెందాలంటే సాంకేతిక విజ్ఞానం మరింత విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ తాహెరా సుల్తానా అన్నారు.

శనివారం పోరంకిలోని భాష్యం బ్లూమ్స్ స్కూల్లో స్టీమ్ ఎక్స్పో -2025 పేరిట నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనను ఆమె కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, కొత్తదనం కోసం ప్రయత్నం వారు తయారుచేసిన నమూనాల్లో స్పష్టంగా కనిపించాయన్నారు.

ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు తయారు చేసిన పలు నమూనాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

కార్యక్రమంలో కృష్ణాజిల్లా భాష్యం స్కూల్ జెడ్ ఈ ఓ జోషి, ప్రిన్సిపాల్ మహాలక్ష్మి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply