Kuntala | నట్టల నివారణ మందుల పంపిణీ

Kuntala | నట్టల నివారణ మందుల పంపిణీ
Kuntala | కుంటాల, ఆంధ్రప్రభ : మూగజీవులకు వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తగా నట్టల మందులను పంపిణీ చేశారు. కుంటాల మండలం లోని విట్టాపూర్ గ్రామంలో ఇవాళ గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందులను స్థానిక సర్పంచ్ సిందే లింగారం పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తగా నట్టల నివారణ మందులను గొర్రెలకు, మేకలకు పంపిణీ చేశారు.
అదేవిధంగా ఆయన మాట్లాడుతూ… మూగజీవులపై పశువైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. పశువుల పట్ల జాగ్రత్త వహించాలని వైద్య సిబ్బందికి తెలిపారు. అదేవిధంగా మూగజీవులకు వ్యాధులు సోకకుండా పంపిణీ చేయడంతో వైద్యాధికారులను ఆయన సత్కరించారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ చిన్నోల్ల అశోక్ లింగారెడ్డి, సిహెచ్ రవి మోహన్, జూనియర్ వెటర్నరీ అధికారి శశిధర్, గోపాలమిత్ర శ్రీధర్, అటెండెడ్ నరేందర్, గొల్ల కురుమలు తదితరులు పాల్గొన్నారు.
