Honor | ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

Honor | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని తాళ్లపేట, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ‌ తెలుగు పాఠశాల సముదాయ సమావేశాన్ని తెలుగు ఉపాధ్యాయులు నిర్వహించారు. ఈసందర్భంగా తాళ్లపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సిరంగి సుదర్శన్ మాట్లాడుతూ… ఉపాధ్యాయులే సమాజానికి దిక్సూచి అని అన్నారు.

తోటి ఉపాధ్యాయురాలు శారదాదేవి ఈనెల 31న పదవీ విరమణ పొందుతున్నందుకు ఆమెను శాలువాతో సత్కరించారు. శారదా దేవి తమ సేవా కాలంలో విద్యార్థుల విద్య వికాసానికి చేసిన విశిష్టత‌ ఆదర్శప్రాయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లపేట కాంప్లెక్స్‌కు చెందిన తెలుగు రిసోర్స్ పర్సన్స్ కె.నరేందర్, ఎం.రమేష్, వి.సుభాష్, నీలాదేవి, సత్యనారాయణ, పౌలు భాషోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply