Womens | అక్ష‌య తృతీయకు జోరుగా కొనుగోళ్లు

Womens | అక్ష‌య తృతీయకు జోరుగా కొనుగోళ్లు

Womens | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఇవాళ అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా బంగారం షాపులు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. అక్ష‌య తృతీయ రోజు ఒక్క గ్రాము బంగారం అయినా కొన‌డం మ‌హిళ‌ల‌కు సెంటిమెంట్‌. ఈ ఏడాది రెండ్రోజుల‌పాటు అక్ష‌య తృతీయ ఉంద‌ని జ్యువెల‌రీ దుకాణ య‌జమానులు చెబుతున్నారు. అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా కొనుగోలు దారుల‌కు ప్ర‌త్యేక ఆఫ‌ర్లు ఇస్తున్న‌ట్లు దుకాణ‌దారులు చెబుతున్నారు. బంగారం, వెండితో పాటు ఇత్తడి, రాగి పాత్రలు, వాహనాలు లేదా కొత్త పెట్టుబడులు ప్రారంభించడానికి కూడా ఈ రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

‘అక్షయ’ అంటే తరగనిది అని అర్థం, కాబట్టి ఈ రోజు బంగారం, వెండి లేదా ఇతర విలువైన వస్తువులు కొనడం వల్ల సిరిసంపదలు పెరుగుతాయని, శుభం జరుగుతుందని ప్రజల బలమైన నమ్మకం. బంగారం ధరలు పెరిగినప్పటికీ, అక్షయ తృతీయ సెంటిమెంట్‌తో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఈ రోజు ఉదయం నుంచే బంగారం షాపులకు కస్టమర్లు పోటెత్తారు. ముఖ్యంగా బంగారం, వెండి నాణేలు, ఆభరణాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ప్రముఖ జ్యువెలరీ సంస్థలు లలితా, మలబార్, తనిష్క్ వంటివి మేకింగ్ ఛార్జీలపై 50% వరకు తగ్గింపులు, ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి.

Leave a Reply