Gurukula School | శ‌భాష్‌.. శివకుమార్

Gurukula School | శ‌భాష్‌.. శివకుమార్

  • రాష్టస్థ్రాయి గురుకుల చెస్ విజేతకు సన్మానం

Gurukula School | ఎడపల్లి, ఆంధ్రప్రభ : జనగామ జిల్లా కేంద్రంలో ఈ నెల 17 నుంచి 20 వరకు నిర్వహించిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల 11వ రాష్టస్థ్రాయి చెస్ పోటీల్లో బోధన్ గురుకుల పాఠశాలకు చెందిన ఎంబ శివకుమార్ అండర్-14 విభాగంలో మొదటిస్థానంలో నిలిచారు. శివకుమార్ స్వస్థలం ఎడపల్లి మండలం జానకంపేట్ కాగా, తమ గ్రామానికి చెందిన విద్యార్థి రాష్టస్థ్రాయిలో రాణించిన‌ విషయం తెలుసుకున్న గ్రామ మాజీ వార్డు సభ్యులు వీరవత్నిరాజు శుక్రవారం శివకుమార్‌ను ఘనంగా సన్మానించారు. శాలువా, రూ.2వేల‌ నగదుతో పాటు వుడ్‌తో తయారు చేసిన చెస్ బోర్డును అందజేసి అభినందించారు. కార్యక్రమంలో బిల్లా గంగాధర్, 12వ వార్డు సభ్యులు రఘుపతి, ఆనంద్, కుర్తే లింగం, సాద సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply