Madhira | వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

Madhira | వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
- జనవరి 29, 30, 31 తేదీల్లో నాటక పోటీలు
Madhira | మధిర, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో జనవరి 29, 30 31 తేదీల్లో మధిర బంజారా కాలనీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో తెలుగు రెండు రాష్ట్రాల స్థాయిలో పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక, పద్య, దృశ్య ఏకాంకిక పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పోలీస్ (Police) గృహ నిర్మాణ శాఖ మాజీ చైర్మన్ పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్, శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం సుబ్బారావు తెలిపారు. శుక్రవారం మాటూరుపేట సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో నాటక పోటీల కరపత్రాలను గ్రామ పెద్దలతో కలిసి వారు ఆవిష్కరించారు.
కార్యక్రమంలో దేవస్థానం
చైర్మన్ రాయల కోటయ్య, గ్రామ పెద్దలు రావూరి శ్రీనివాసరావు, మాదాల రామారావు, గడ్డం శ్రీహరి, తాటికొండ (Thatikonda) వెంకటేశ్వరరావు, తల్లపురెడ్డి నాగిరెడ్డి, గ్రామ సర్పంచ్ చిలువేరు అన్నపూర్ణమ్మ బుచ్చిరామయ్య, గడ్డం రమేష్, మండేపూడి వెంకటేశ్వరరావు మాదాల శ్రీను, గడ్డం శేషు, సామినేని చందర్ రావు, నెల్లూరు మోహన్ రావు, పోతినేని శ్రీధర్, గడ్డం వాసు కళాకారులు చిలువేరు శాంతయ్య, గుర్రాల కృష్ణారెడ్డి, ఏటికీల కోటేశ్వరావు, పోతినేని కృష్ణమూర్తి, సంక్రాంతి వీరయ్య, తదితరులు పాల్గొన్నారు
