Pamarru | వంగవీటి.. చిరంజీవి

Pamarru | వంగవీటి.. చిరంజీవి
- ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
Pamarru | పామర్రు, ఆంధ్రప్రభ : పేదల గుండెల్లో గూడు కట్టుకున్న చిరస్మరణీయుడు వంగవీటి మోహన రంగా అని ఎమ్మెల్యే (Mla) వర్ల కుమార్ రాజా అన్నారు. రంగా వర్ధంతి వేడుకలు పురస్కరించుకుని స్థానికంగా ఉన్న రంగా విగ్రహానికి ఎమ్మెల్యే పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నిర్వాహకులు రాధా రంగా మిత్రమండలి ఆర్గనైటెడ్ తాడిశెట్టి సాంబశివరావు, తాడిశెట్టి మధు, అల్లంశెట్టి సురేష్, మండపాక శంకర్ బాబు, అంజిబాబు, టీడీపీ నేతలు దాలిపర్తి ప్రసాద్, వల్లూరుపల్లి గణేష్, మండపాక శంకర్ బాబు, జనసేన ఇన్చార్జి తాటిచెట్టు నరేష్ తదితరులు పాల్గొన్నారు
