Mudhol | సర్పంచ్, ఉప సర్పంచ్ లకు సన్మానం

Mudhol | ముధోల్, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన ముధోల్ మేజర్ గ్రామపంచాయతీకి ఇటీవలే నూతనంగా సర్పంచ్ గా షబానా బేగం ఎజాజోద్దీన్, ఉప సర్పంచ్ గా కోరి లావణ్య సాయినాథ్ లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇవాళ‌ ముధోల్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సర్పంచ్, ఉప సర్పంచ్ లను ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈసందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్ లు మాట్లాడుతూ… గ్రామాభివృద్ధి అందరి సహకారంతో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చాతరాజు దురప్రసాద్, సభ్యులు సునీల్, రాహుల్, పవన్, శరత్, బషీర్, నగేశ్, ముఫ్తీ, గంగారెడ్డి, దొంతుల్వార్ రమేష్ అజీమ్ తో పాటు తదితరులున్నారు.

Leave a Reply