22 grams cannabis | డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమజంట అరెస్టు

22 grams cannabis | డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమజంట అరెస్టు
22 grams cannabis | హైదరాబాద్, ఆంధ్రప్రభ : నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు జోరుగా కొనసాగిస్తున్న ఆపరేషన్(Operation)లో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్‌న్యూ పోలీసులు చేపట్టిన ప్రత్యేక సోదాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమజంటతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
నిందితుల్లో ముగ్గురు పెడ్లర్లు, ఒకరు వినియోగదారుడిగా గుర్తించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో 22 గ్రాముల హైడ్రోఫోనిక్ గంజాయి(22 grams of hydroponic cannabis), 5 గ్రాముల ఎండీఎంఏ, 5.5 గ్రాముల ఎక్స్టసీ పిల్స్, 7 ఎల్ఎస్డీ బ్లాట్స్ ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రహస్యంగా నిఘా పెట్టి ఈ రాకెట్‌ను బయటపెట్టారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అరెస్టులతో నగరంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌కు మరో దెబ్బ తగిలినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
