MLA | చెక్కులు పంపిణి..

MLA | చెక్కులు పంపిణి..

MLA | పెడన, ఆంధ్రప్రభ : ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ పేదవర్గాలందరికీ వైద్య సేవలు అందించేలా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. పెడన నియోజకవర్గంలోని పలువురు పేదలు పలు ఆసుపత్రులలో వివిధ రకాల చికిత్సలు పొందిన వారికి ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ సిఫారసుతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 31 మందికి మంజూరు అయిన రూ.15 లక్షల 80 వేల 888 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు, రెండు ఎల్ఓసీలను లబ్దిదారులకు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పెడన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పంపిణి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురైన వారు ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి సహయనిధి పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నదని, ఇంటి పెద్ద కొడుకుగా చరిత్రలో నిలిచిపోతారని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కొనియాడారు. తమను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకున్న ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కి పార్టీ నేతలు, లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.