Government | అన్ని కుల మతాలు… అందరూ సమానులే…

Government | అన్ని కుల మతాలు… అందరూ సమానులే…

  • ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్

Government | ఉట్నూర్, ఆంధ్రప్రభ : అన్ని కుల మతాలు, అందరూ సమానమే ఎవరి కులమతాలను కించపరచరాదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఈ రోజు అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని లక్కారంలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు బొచ్చు పటేల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా క్రిస్టియన్స్(Christians) పెద్దల సమక్షంలో కేక్ కట్ చేసి క్రిస్టియన్స్ సోదరి సోదరులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి నివాళి ప్రేమను పంచాలి అని ఏసుప్రభు ఇచ్చిన గొప్ప సందేశం స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హాయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో లక్కారం నూతన సర్పంచ్, రేణుక, ఫాదర్స్, క్రిస్టమస్ కుల పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply