Indravelli | కేస్లాపూర్ జాతరకు తేరలేపిన
Indravelli | కేస్లాపూర్ జాతరకు తేరలేపిన
- మెస్రం వంశీయులు
- మురాడి వద్ద మేశ్రమ వంశీయుల సాంప్రదాయక పూజలు
- నేల పై తంబాకు వేసి ప్రచార రథాన్ని సాగపంపారు
Indravelli | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణలో రెండవ జాతరగా గుర్తించిన కేస్లాపూర్ నాగోబా జాతరకు మెస్రం వంశీయులు ప్రచార రథంతో తెరలేపారు. పుస్యమాసం అమవాస్యను పురష్కరించుకొని జనవరి 18న తేదీన మెస్రం వంశీయుల మహా పూజతో నాగోబా జాతర ప్రారంభించనున్నారు. అందులో భాగంగా కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా మురాడి వద్ద నెలవంకకు మొక్కి ప్రత్యేక పూజలు చేశారు. మరుసటి రోజైన ఇవాళ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మెస్రం వంశీయులు కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా మురాడి వద్దకు చేరుకొని సమావేశం నిర్వహించి నాగోబా మహాపూజ ప్రచార యాత్ర గంగాజలం సేకరణ యాత్ర, నాగోబా మహాపూజ నిర్వహనపై చర్చించారు.
మురాడి వద్ద సంప్రదాయ పూజలు చేసి నాగోబా ప్రచార రథం ప్రారంభించారు. అనంతరం మెస్రం వంశీయులు నేలపై తంబాకు వేసి ప్రచార రథాన్ని (ఎడ్ల బండిని )ఊరు పొలిమేర వరకు సాగనంపారు. సిరికొండ మండలంలోని కుమ్మరి గుగ్గిల స్వామి వద్ద ప్రచార రథం ద్వారా మెస్రం హనుమంతు కటోడ, మెస్రం దాదారావ్ (ప్రధాన్) చేరుకొని మహా పూజకు అవసరమయ్యే మట్టి కుండల తయారీకి ఆదేశిస్తారు.

Indravelli | నాగోబా ప్రచార రథం షెడ్యూల్ ఇలా…
1.23/12/2025 తేదీన మంగళవారం రాజంపేట లో( బస)
2.24/12/25 న బుధవారం సోయం గూడ( బస)
3.25/12/2025 న గిన్నెర( బస)
4.26/12/2025 న గురువారం సాలేవాడ (బస)
5.27/12/2025 న శనివారం పొల్లుగూడ( బస)
6.28/12/2025 ఆదివారం న వడగవ్ (బస)
7.29/12/2025 న సోమవారం కేస్లాపూర్ లో( బస)
నాగోబా జాతర ప్రచార రథం ఏడు రోజుల పాటు కొనసాగునున్నట్లు మెస్రం వంశీయుల ఆలయ పిఠాధిపతి మెస్రం వెంకట్రావ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం తుకారం, నాగోబా ఆలయ కమిటి చైర్మన్ మెస్రం ఆనంద్రావ్, మెస్రం వంశ పెద్దలు మెస్రం చిన్నుపటేల్, మెస్రం నాగ్నాథ్ కోసేరవ్ కటోడ, మెస్రం శేఖర్ బాబు, తదితరులున్నారు.
