Helping | మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం

Helping | మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం

  • సర్పంచ్ వడుగురి శాంతాచిన్న బాపు ఉదారత

Helping | కన్నెపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని జజ్జరవెల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కొట్రంగి పద్మ ఇటీవల మృతి చెందింది. నిరుపేద కుటుంభం కావడంతో చలించి పోయిన గ్రామసర్పంచ్ వడుగురి శాంత చిన్నబాపు ఉపసర్పంచ్ కొట్రంగి రాజ్ కుమార్, బీ ఆర్ ఎస్ నేత లింగంపల్లి రాజశేఖర్ కలిసి గ్రామస్థుల సహకారంతో మృతురాలి కుటుంబానికి రూ.10 వేల రూపాయలు ఆర్థిక సహాయంఅందించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి తీరుస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొట్రంగి రమేష్, తలండి అశోక్, ఎలాది రమేష్, తాళ్లపల్లి లక్ష్మణ్, మేరుగు ప్రసాద్, దుర్గం దసరయ్య, కుమార్ యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply