Chandur | విద్యార్థులకు బహుమతుల ప్రధానం

Chandur | విద్యార్థులకు బహుమతుల ప్రధానం
Chandur | చందూర్, ఆంధ్రప్రభ : చందూరు మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల (School) విద్యార్థులకు ఆట పోటీలను నిర్వహించి వారికి బహుమతుల ప్రధానం చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మద్దూరి మాధవరెడ్డి, ఉప సర్పంచ్ దాకడి సురేఖ సాయిలు హాజరై విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయుల బృందం సర్పంచ్, ఉపసర్పంచ్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.
