3 People died | బైక్ గోడను ఢీకొట్టి…

3 People died | బైక్ గోడను ఢీకొట్టి…
ముగ్గురు మృతి
3 People died | పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రభ : బైక్ గోడను ఢీకొట్టి… స్పాట్ లోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెనుమంట్ర (Penumantra) పరిధిలోని పోలమూరు (Polamoor) గ్రామంలో మద్యం మత్తులో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు నియంత్రణ కోల్పోయి ఎదురుగా ఉన్న గోడను బలంగా ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు (Three died).
పోలమూరు గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం (postmortem) నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి దుర్ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులున్నారు.
