Peddi| ఢిల్లీలో పెద్ది. ఎందుకో తెలుసా..?

Peddi| ఢిల్లీలో పెద్ది. ఎందుకో తెలుసా..?

  • మెగా పవర్ రామ్ చరణ్ సందడి..
  • అత్యంత ప్రతిష్టాత్మక ప్రదేశాల్లో షూటింగ్..
  • నాలుగు రోజులుగా దేశ రాజధాని లోనే..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ తుది దశకు చేరుకున్న‌ట్లు తెలుస్తుంది. తాజాగా చిత్ర యూనిట్ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కీలక షెడ్యూల్‌ను నిర్వహిస్తోంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని అత్యంత ప్రతిష్టాత్మక ప్రదేశాల్లో షూటింగ్ జరగనుండటం విశేషం. ఇప్పటికే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, జామా మసీద్, ఎర్రకోట వంటి చారిత్రక ప్రదేశాల్లో రామ్ చరణ్‌ పై కీలక సన్నివేశాలను షూట్ చేసినట్లు తెలిసింది. భారీ పొగమంచు కారణంగా ఆలస్యమైనప్పటికీ, ఆ ప్రాంతంలో షూటింగ్ కొనసాగింది. ఈ సినిమా షూటింగ్ నాలుగు రోజుల పాటు జరగనుంది. అయితే.. గతంలో కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ షెడ్యూల్, ఇప్పుడు పటిష్ట భద్రత మధ్య సాగుతోంది.

ఈ ఢిల్లీ షెడ్యూల్ సినిమా స్టోరీలో చాలా కీలకమైన మలుపు అని, అందుకే భారీ వ్యయంతో ఇక్కడ షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ షూటింగ్‌కి సంబంధించి రామ్ చ‌ర‌ణ్ ఫొటో ఒక‌టి వైర‌ల్‌గా మారింది. చేతిలో సంచి ప‌ట్టుకుని రామ్ చ‌ర‌ణ్ ఎవ‌రినో కల‌వ‌డానికి వెళుతుండ‌గా.. అత‌డిని పోలీసులు ఆపుతున్న‌ట్లు ఫొటోలు కొన్ని మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెండు రోజులుగా ఢిల్లీలోనే షూటింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న చిత్ర యూనిట్ బృందం పెద్ది సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ వద్ద ఈ రోజు సాయంత్రం పెద్ది హీరో రామ్ చరణ్ సందడి చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికార యంత్రం, ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు సైతం ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Leave a Reply