Jr.NTR | త్వరలోనే కలుస్తా.. అలాంటివి చేయకండి – ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ రిక్వెస్ట్ !
అభిమానులందరినీ త్వరలోనే కలుస్తానని జూ.ఎన్టీఆర్ అన్నారు. ఈ మేరకు తన ఫ్యాన్స్ కోసం ఓ నోట్‌ను విడుదల చేశారు. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనను కలవాలని ఎదురుచూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకున్న ఎన్టీఆర్… త్వరలో అభిమానుల సమావేశం ఏర్పాటు చేసి అభిమానులందరినీ వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు.
అయితే, తనను కలిసేందుకు అభిమానులు పాదయాత్రలు వంటివి చేయద్దొని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. తనకు అభిమానుల ఆనందమే కాదని, వారి సంక్షేమం కూడా చాలా ముఖ్యమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
పోలీసు శాఖ, ఇతర సంబంధిత అధికారుల సమన్వయంతో శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని.. అభిమానులతో ఎన్టీఆర్ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నట్లు ఎన్టీఆర్ కార్యాలయ బృందం తెలిపింది. ఇంత పెద్ద సమావేశం నిర్వహించేందుకు కాస్త సమయం పడుతుందని.. అభిమానులు ఓపిక పట్టాలని ఎన్టీఆర్ కోరుతున్నట్లు వారు పేర్కొన్నారు.