TG | అట్టహాసం.. ప్రమాణ స్వీకారోత్స‌వం

TG | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల వ్యాప్తంగా సోమవారం మండలంలోని 16 గ్రామ పంచాయతీలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్స‌వాన్ని అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. గ్రామాల స్పెషల్ అధికారుల ఆధ్వర్యంలో నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా కొత్త సర్పంచ్‌లు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామస్తులు అభివృద్ధికి తోడ్పాటు అందించాల‌ని కోరారు. కార్యక్రమంలో స్పెషల్ అధికారులు శ్రీనివాస్, రాజిరెడ్డి, భిక్షపతి, రమ్యశ్రీ, సోమలింగారెడ్డి, శ్రీనిధి, యాదగిరి, శ్రీనివాస్, సర్పంచులు అందే కొండల్ రెడ్డి, చల్మేటి నరేందర్, బొమ్మన మల్లేశం, రామచంద్రనాయక్, భాను ప్రసాద్, ముత్యాల సరిత పాల్గొన్నారు.

Leave a Reply