Sarpanch | నమ్మకాన్ని వమ్ము చేయను..

Sarpanch | నమ్మకాన్ని వమ్ము చేయను..
- పార్టీలు కాదు.. గ్రామ అభివృద్ధి లక్ష్యం
- సిరిపురం గ్రామ సర్పంచ్ చీటకోడూరు సంపత్
Sarpanch | ఆంధ్రప్రభ ప్రతినిధి, జనగామ : గ్రామ ప్రజలు నాపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను ప్రభుత్వ సహకారంతో గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని, నూతనంగా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన సిరిపురం గ్రామ సర్పంచ్ చీటేకోడూర్ సంపత్ అన్నారు. సోమవారం మండలంలోని సిరిపురం గ్రామపంచాయతీ ఆవరణలో పంచాయతీ సెక్రటరీ శంకర్ నూతన పాలకవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నూతనంగా నాతో పాటు ఎన్నికైన ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు గ్రామ ప్రజలకు ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా పనిచేస్తానన్నారు. నూతన ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉప సర్పంచ్ బసవగాని లలిత, బండ్రు బీరయ్య, కల్లె వెంకటేష్, కంతి భాగ్య, ఎండ్ర సంధ్య, బసవ గాని విటల్, చిడకోడూరు ప్రేమ్ కుమార్, కొండ వాణి ఉన్నారు.
కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొల్లూరి శివకుమార్, వేముల కృష్ణారెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షులు ఎంగలి సత్యనారాయణ, బసవగాని ఉపేందర్, బర్ల కుమార్, బసవ గాని అనిల్, కీసరి రంగారెడ్డి, బసవ గాని నరేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బసవగాని వెంకటేష్, ఎండ్ర ప్రకాష్, బసవల్లి రామ నర్సయ్య, బండ రామచంద్రన్, సీహెచ్ మల్లేశం, బసవ గాని శ్రీనివాస్, బుష్ గంపల సమ్మయ్య, బస్సుగాని విఠల్, కొత్త వినోద్, దుర్గి రేణుక, కాళ్ల వెంకటేష్, కాళ్ల భాస్కర్, కుంట్ల సిద్ధులు కుమార్, మీసాల కృష్ణ, బొమ్మల మల్లేశం, బండ స్వామి, కొత్త స్వామి, అంజయ్య, చందు ,అనిల్ తదితరులు పాల్గొన్నారు
