Gurukul school | ‘ముస్తాబు’ లక్ష్యం ఇదే

Gurukul school | ‘ముస్తాబు’ లక్ష్యం ఇదే
Gurukul school | మోపిదేవి, ఆంధ్రప్రభ : విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ‘ముస్తాబు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి సవిత అన్నారు. సోమవారం కృష్ణా మోపిదేవిలోని మహాత్మా జ్యోతిరావ్ పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఆమె ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని మౌలిక వసతులు, విద్యార్థులకు అందిస్తున్న భోజన సదుపాయాలను మంత్రి పరిశీలించారు.
సభలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిరావ్ పూలే బీసీ గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్య, భోజనం అందిస్తుందని తెలిపారు. బడుగు, బలహీనవర్గాల పిల్లలు అన్ని రంగాల్లో చదువుకోవాలని అన్న నందమూరి తారక రామారావు ఎంతో కృషి చేశారని తెలిపారు. అదే విధంగా బడుగు, బలహీనవర్గాల పిల్లలకు చంద్రబాబు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని అన్నారు. ముస్తాబు కార్యక్రం ద్వారా వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని తెలిపారు. ముస్తాబు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. సన్న బియ్యం కూడా సరఫరా చేస్తున్నామని, యూనిఫామ్ లో ఎక్కడా కూడా మా ఫొటోలు వేసుకోలేదని, సర్వేపల్లి రాధాకృష్ణ పేరున అందజేసినట్టు తెలిపారు. మీ వ్యక్తిగత పరిశుభ్రత ఖచ్చితంగా అవసరమని, డ్రస్ కోడ్ నీట్ గా ఉండాలని, దానిలో పాటు ఉదయం యోగా చేయాలని, పర్యావరణాన్ని కాపాదుకోవాలని తెలిపారు.
సెలవుల్లో మీ ఇంటికి వెళ్లినప్పుడు తల్లిదండ్రులకు చేతుల పరిశుభ్రత పై అవగాహన కల్పించాలన్నారు. ఈ పాఠశాల 11.50 ఎకరాల విశాలమైన ఆవరణ ఉందని, మన ఆస్తిని కాపాడుకోవాలని, మీ క్లాసు రూమ్, వాష్ రూమ్ ఆస్తిగా భావించాలని తెలిపారు. మనకెందుకులే మన పని అయిపోయిందని అనుకోకుండా క్లాస్ రూమ్, వాష్ రూమ్, ప్లేట్లు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎడ్యుకేషన్ ఎంత అవసరమో క్రమ శిక్షణ అవసరమన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ విద్యార్థి దశ నుంచి రాజకీయాల గురించి అవగాహన కోసం మాక్ అసెంబ్లీ కూడా ఏర్పాటు చేశారన్నారు.
మేము కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేదని, ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నామని, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అన్ని వసతులు కల్పిస్తున్నారని అన్నారు. ఈ ఏడాది కూడా పదవ తరగతిలో నూరుశాతం ఫలితాలు సాధించి ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించాలని కోరారు. ఆడిషనల్ క్లాస్ రూమ్ లు కూడా అడిగారని, సాస్కి నిధులతో వాటిని మంజూరు చేయిస్తానని తెలిపారు. ముస్తాబు కార్యక్రమాన్ని ఖచ్చితంగా పాల్ అవ్వాలని తెలిపారు.
