Collector Rajakumari | నిర్లక్ష్యం వద్దు…

Collector Rajakumari | నిర్లక్ష్యం వద్దు…
- చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపండి
- రెండు పోలియో చుక్కలు.. వికలత్వానికి దూరం
Collector Rajakumari | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రెండు పల్స్ పోలియో చుక్కలు చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని, వికలత్వానికి దూరం చేయవచ్చని, అందుకు చిన్నారుల తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, రాష్ట్ర వైద్య శాఖ జాయింట్ డైరెక్టర్ దేవసాగర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాగిరి వెంకటరమణ పేర్కొన్నారు. ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణం నూనెపల్లి ప్రాంతంలోని ఠాగూర్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో నిర్మూలనకు అందరూ బాధ్యతగా సహకరించాలని సూచించారు. జిల్లాలో2.38 లక్షల మంది ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్నారన్నారు. వీరికోసం 1318 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. అందుకోసం 5272 మంది సిబ్బందిని నియమించామన్నారు. జన సంచారం అధికంగా ఉన్నచోట బూత్‌లు ఏర్పాటు చేశారు. బస్టాండ్లలోనూ ఐదు సంవత్సరాల పిల్లలు కనిపిస్తే పోలియో వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బంది. టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
