Vijayawada | వెస్ట్ ను బెస్ట్ గా చేయ‌డ‌మే ధ్యేయం..

Vijayawada | వెస్ట్ ను బెస్ట్ గా చేయ‌డ‌మే ధ్యేయం..

  • వివిధ శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాలి…
  • అల‌స‌త్వం వ‌హిస్తే స‌మహించేది లేదు..
  • క‌లెక్ట‌ర్ తో జ‌రిగిన‌ నియోజ‌క‌వ‌ర్గం స‌మీక్ష‌లో ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి …

ఆంధ్రప్రభ విజయవాడ : రాష్ట్రంలోనే పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా నెంబర్ వన్ గా నిలపాలని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు యలమంచిలి సత్యనారాయణ(సుజనా) చౌదరి పేర్కొన్నారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం అభివ్రుద్ది పై అధికారుల‌తో శనివారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి స‌మీక్ష నిర్వ‌హించారు.

జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీ శా, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర‌, వివిద శాఖ‌ల అధికారులతో క‌లిసి 18 నెల‌ల కూట‌మి పాల‌నలో జ‌రిగిన అభివ్రిద్ది, జ‌ర‌గాల్సిన ప‌నుల పురోగ‌తిని ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి అధికారుల‌తో ముఖాముఖి నిర్వ‌హించారు.

వస్త్రలత బిల్డింగ్ పెండింగ్ అద్దెల వసూళ్లు, ఆ స్థానంలో నిర్మించతలపెట్టిన మల్టీ లెవల్ కాంప్లెక్స్ కార్యాచరణ, నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుతో పాటు, రైల్వేకు చెందిన ఖాళీ స్థలాలను సేకరించి అక్కడ టిడ్కో ఇళ్లు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, అనధికారికంగా వినియోగంలో ఉన్న మున్సిపల్ స్థలాలు, కాంప్లెక్సుల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఏ దశలో ఉందో ఆరా తీశారు.

ప్రభుత్వ పాఠశాలల అప్‌గ్రేడెషన్, నియోజకవర్గ వీధుల్లో ప్రమాదకరంగా మారిన అస్తవ్యస్త కేబుల్స్ క్రమబద్ధీకరణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. భవానీపురం లారీ స్టాండ్‌లో MSME హబ్ ఏర్పాటుకు ఉన్న ప్రతిపాదనలను పరిశీలించడంతో పాటు, నగరంలో పార్కుల అభివృద్ధి, మున్సిపల్ పన్నుల వసూళ్లు, ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణ చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఇక శాంతిభద్రతల విషయంలో రాజీ పడకూడదని, రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు.

సుజనా ఆలంబన పేరిట యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలనే ఆలోచన అమలోకి పెట్టేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. ఎర్ర కట్ట అభివృద్ధి, ఆర్ఓబీ కోసం ఏప్రిల్లో చేసిన‌ ప్ర‌తిపాద‌న‌లు, 150 పడకల ఆసుపత్రి కి సీవీ రెడ్డి చారిటీస్ స్థలం సేక‌ర‌ణ అంశం, డ్రగ్స్ డీ ఎడిక్షన్ కోసం, రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు త‌దిత‌ర అంశాల‌ను ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి ఆధికారుల‌ను అడిగి వాటి స్టేట‌స్ ను తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ… దుర్గ‌గుడి, న‌గ‌ర‌పాల‌క సంస్థ , పోలీస్, రెవిన్యూ తో పాటు వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించాము.

ఇకపై ప్రతి 45 రోజుల‌కు ఒకసారి అన్ని అంశాల సమీక్ష ద్వారా అభివృద్ధి పనుల్లో పురోగతి మానిటరింగ్ చేస్తామన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ శాఖ‌ల మ‌ద్య కొంత స‌మ‌న్వ‌య లోపం జ‌రిగింద‌ని… ఇక‌పై అభివ్రుద్ది విష‌యంలో అల‌స‌త్వం వహిస్తే స‌హించేది లేద‌ని సుజ‌నా చౌద‌రి హెచ్చ‌రించారు.

ఈ సంద‌ర్భంగా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి సంబందించిన విజ‌న్ డాక్యుమెంట్ ను సుజ‌నా ఫౌండేష‌న్ అడ్వైజ‌ర్ వేజెండ్ల శ్రీనివాస‌రావు ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. ఎన్నిక‌ల హామీల్లో కొన్నింటిని పూర్తి చేశామని, కొన్ని ప్ర‌తిపాద‌న‌ల ద‌శ‌లో ఉన్పాయని, ఆన్నీ ప‌నుల‌న‌ను చేయడానికి వివిధ శాఖల మధ్య సమన్వయం లోపం అవ‌స‌రం ఉందని, వెస్ట్ ను బెస్ట్ ను చేసేందుకు రూట్ మ్యాప్ ను రూపొందించామమి, అందుకు అనుగుణంగా అధికారుల‌ను పూర్తి స్థాయిలో ఇన్ వాల్వ్ చేసి ప‌నుల‌ను పూర్తి చేస్తాం అని తెలిపారు.

సీఎం చంద్ర‌బాబు రూపొందించిన నియోజ‌క‌వ‌ర్గ స్థాయి విజ‌న్ డ‌వ‌ల‌ప్మెంట్ టీమ్ ను స్థానిక ప్ర‌భుత్వ శాఖ‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారానికి క్రిషి చేస్తామని పేర్కొన్నారు. భ‌విష్య‌త్ లో నియోజ‌క‌వ‌ర్గం అభివృద్దికి ప్ర‌తి అధికారి బాద్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించామన్నారు.

కొన్ని ప‌నులు ప్రభుత్వం నుంచి అనుమతులు , పొందినా నిధుల కొర‌త వ‌ల్ల ఆల‌స్యం జ‌రుగుతోంది. కొన్ని ప‌నుల‌ను సీఎస్సార్ నిధుల ద్వారా సొంత‌గా చేశామని, అవసరమైతే మ‌రి కొన్ని సంస్థ‌ల నుంచి నిధుల‌ను కేటాయించి నియోజ‌కవ‌ర్గం అభివృద్దికి క్రిషి చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ లక్ష్మీ శా , మున్సిప‌ల్ కమిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర‌, రెవిన్యూ, పోలీసు శాఖ‌, విద్యుత్ శాఖ‌, కార్పొరేష‌న్, గ్రుహ నిర్మాణ శాఖ‌, తో పాటు వివిధ శాఖ‌ల ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply