Carry Bag | ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’

Carry Bag | ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’

  • స్వయంగా ట్రాక్టర్ నడిపిన కలెక్టర్ డీకే బాలాజీ

Carry Bag | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : ప్రతి మూడో శనివారం నిర్వహించే ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమాన్ని అధికారులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్ ను, క్యారీ బ్యాగ్ లను నిషేధించాలని కోరారు. కలెక్టర్ ప్రాంగణంలో చెత్తను డస్ట్ బిన్ లో మాత్రమే వేయాలని సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ స్వయంగా మున్సిపల్ ట్రాక్టర్ నడిపారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ స్వచ్ఛ కార్యక్రమాల్లో పాల్గొనాలని, గ్రామాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి మూడవ శనివారం ఖచ్చితంగా స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారని తెలిపారు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంటు వ్యాధులు దరిచేరకుండా పరిసరాలను ప్రతిఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Leave a Reply