Village development | ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవచేయాలి…
Village development | ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవచేయాలి…
- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కొండయ్య.
Village development | ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధికి ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించాలని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధి(Village development)కి కృషి చేయాలని మక్తల్, మాజీ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.కొండయ్య అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ బీజేపీ బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యులు గెలుపొందడంతో వారిని సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ చేయడంలో నాయకులకు ఎంతో తృప్తిని ఇస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలతో పాటు, ఎంపీ నిధులు తీసుకువచ్చి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఊట్కూర్ మండలంలో 8 సర్పంచ్ స్థానాల(8 sarpanch posts)ను బీజేపీ గెలుపొందడం అభినందనీయమని అన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తల కృషితోనే మెజార్టీ స్థానాలు గెలుపొందామని అన్నారు.
బీజేపీలో కష్టపడి పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండటంతో పాటు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ తమకుఅండగాఉంటుందన్నారు. అనంతరం గెలుపొందిన నాయకులకు మిఠాయిలు తినిపించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బిజ్వార్ నూతన సర్పంచు కొల్లంపల్లి అంజయ్య, వార్డు సభ్యులు చెన్నారెడ్డి, రాఘవేంద్ర, గుడిసె చిన్న రాజు, పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
