12th release | సంక్రాంతికి రసవత్తరమైన పోటీ..

12th release | సంక్రాంతికి రసవత్తరమైన పోటీ..
12th release | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : సంక్రాంతి వస్తుందంటే.. సినిమాల పండగ వస్తున్నట్టే.. ఈ సీజన్ లో సినిమా రిలీజ్ చేస్తే.. ఆ సినిమాకి వచ్చే కలెక్షన్స్(Collections) వేరే లెవల్లో ఉంటాయి. అందుకనే స్టార్ హీరోలు, దర్శకనిర్మాతలు సంక్రాంతికి తమ సినిమాను రిలీజ్ చేసేందుకు పోటీపడుతుంటారు. ఈ సంక్రాంతికి ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా భారీ, క్రేజీ సినిమాలు(crazy movies) పోటీకి సై అంటున్నాయి. ఇంతకీ.. ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలు రాబోతున్నాయి. ఆ భారీ, క్రేజీ సినిమాలు ఏంటి…?
12th release |రాజాసాబ్..
సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ది రాజాసాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. హర్రర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ టైమ్ ప్రభాస్ హర్రర్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తుండడం.. అలాగే ఇందులో ప్రభాస్ ని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా మారుతి చూపిస్తుండడంతో రాజాసాబ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని డార్లింగ్ ఫ్యాన్స్(Fans) ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జనవరి 9న ఈ భారీ, క్రేజీ మూవీ థియేటర్స్ లోకి రానుంది.

12th release |మన శంకర్ వరప్రసాద్ గారు..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్(successful) డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఇందులో విక్టరీ వెంకటేష్ ముఖ్యపాత్ర పోషిస్తుండడం విశేషం. ఇటీవల చిరు, వెంకీల పై స్పెషల్ సాంగ్ షూట్ చేశారు. ఈ సాంగ్ ను కొత్త సంవత్సర కానుకగా డిసెంబర్ 31న లేదా జనవరి 1న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ఇటీవల అనిల్ రావిపూడి తెలియచేశారు. ఇందులో చిరుకు జంటగా నయనతార నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు పాటలు.. విశేషంగా ఆకట్టుకుని.. యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతున్నాయి. ఈ క్రేజీ మూవీని జనవరి 12న రిలీజ్(release on 12th) చేయనున్నారు.
12th release |భర్త మహాశయులకు విజ్ఞప్తి..

మాస్ మహారాజా రవితేజ, క్లాస్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ మళ్లీ మళ్లీ వినాలి అనిపించేలా ఉంది. సాంగ్ కు వచ్చిన ఫీడ్ బ్యాక్(feedback) తో.. సినిమా పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. గత కొంతకాలంగా రవితేజ నుంచి వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఈ సినిమా మాత్రం సంక్రాంతికి వస్తుండడంతో ఖచ్చితంగా సక్సెస్ అందిస్తుందనే టాక్ అయితే వినిపిస్తుంది. ఎప్పుడు రిలీజ్ కానుంది అనేది అఫిషియల్ గా డేట్ అనౌన్స్(date announcement) చేయలేదు కానీ.. సంక్రాంతికి వచ్చేందుకు మాత్రం రెడీ అవుతుంది.
12th release |అనగనగా ఒక రాజు..

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన కొత్త సినిమా అనగనగా ఒక రాజు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్(entertainments) నిర్మిస్తుంది. మారి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన భీమవరం బల్మా అంటూ సాగే పాట ఆకట్టుకుంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను మోహన్ తో కలిసి నవీన్ పొలిశెట్టి పాడడం విశేషం. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను జనవరి 14న రిలీజ్ చేయనున్నారు.
12th release |నారీ నారీ నడుమ మురారి..
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న చిత్రం నారీ నారీ నడుమ మురారి. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్, ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్స్(female male lead roles)లో నటిస్తున్నారు. శర్వానంద్ నటించిన శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలు సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి సినిమా కూడా సంక్రాంతికి వస్తుండడంతో సక్సెస్ గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.


12th release |జన నాయగన్, ఆదిపరాశక్తి..
తెలుగు నుంచి స్ట్రైయిట్ సినిమాలు ఐదు రిలీజ్ అవుతుంటే.. తమిళ్ నుంచి జన నాయగన్, ఆదిపరాశక్తి రిలీజ్ కానున్నాయ. జన నాయగన్.. కోలీవుడ్ స్టార్(Kollywood star) విజయ్ నటిస్తున్న ఆఖరి సినిమా. దీంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. జనవరి 9న జన నాయగన్ రిలీజ్ కానుంది. అలాగే శివ కార్తికేయన్ నటిస్తున్న ఆదిపరాశక్తి మూవీ కూడా సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతుంది. మొత్తంగా సంక్రాంతికి ఏడు సినిమాలు వచ్చేందుకు రెడీ అవుతుండడం ఆసక్తిగా మారింది. అయితే.. ఈ ఏడు సినిమాలు సంక్రాంతికి థియేటర్స్(theaters) లోకి వస్తాయా..? లేక ఏ సినిమా అయినా పోస్ట్ పోన్ అవుతుందా..? అనేది ఆసక్తిగా మారింది. చూడాలి మరి.. ఏం జరగనుందో..?


click here to read రేస్ లో హోంబౌండ్
దీంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. జనవరి 9న జన నాయగన్ రిలీజ్ కానుంది. అలాగే శివ కార్తికేయన్ నటిస్తున్న ఆదిపరాశక్తి మూవీ కూడా సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతుంది. మొత్తంగా సంక్రాంతికి ఏడు సినిమాలు వచ్చేందుకు రెడీ అవుతుండడం ఆసక్తిగా మారింది. అయితే.. ఈ ఏడు సినిమాలు సంక్రాంతికి థియేటర్స్(theaters) లోకి వస్తాయా..? లేక ఏ సినిమా అయినా పోస్ట్ పోన్ అవుతుందా..? అనేది ఆసక్తిగా మారింది. చూడాలి మరి.. ఏం జరగనుందో..?
