Election | హుకుంలు జారి చేస్తున్నట్లు ఆరోప‌ణ‌లు..

Election | హుకుంలు జారి చేస్తున్నట్లు ఆరోప‌ణ‌లు..

Election | నర్సంపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీ రాజకీయాలను చేసి పార్టీలు మారాలని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(MLA Peddi Sudarshan Reddy) ఆరోపించారు. చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము తండాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేయగా తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నర్సంపేట పట్టణంలోని జిల్లా ఆసుపత్రి మెడికల్ కళాశాల(Medical College)లో బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు.

ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గంలోని గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రౌడీ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ ఇప్పటికి పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే దొంతి ఎన్నిక‌ల‌ ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు.

ఎన్నికల ప్రచారాల్లో ఇందిరమ్మ ఇళ్ల ముచ్చట తప్పా అభివృద్ధి పై ఊసెత్తడం లేదనీ ఎద్దేవ చేశారు. ప్రచారంలో గిరిజనలు ఏం అభివృద్ధి చేశారని కాంగ్రెస్ నాయకులను నిలదీయడంతో దాడులకు పాల్పడుతున్నారని స్పష్టం చేశారు. ప్రశ్నించిన గ్రామస్తులపై రౌడిషీట్లు(Rowdysheets) నమోదు చేయండి పోలీసులకు హుకుంలు జారి చేస్తున్నట్లూ ఆరోపించారు.

రాత్రి దాడి జరిగిన మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడి జరిగితే ఇప్పటివరకు ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా వెళ్ళలేదన్నారు. నర్సంపేట రూరల్ మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై నర్సంపేట పోలీస్ అధికారుల(Police Officers)కు నేను ఫిర్యాదు చేయగా వారు తిరిగి నాపై కేసు నమోదు చేస్తా అంటున్నారన్నారు.

ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతోనే బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడుతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జరిగిన ఘటన పై రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్(Election Commissioner)కు ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లగించి ప్రచారం ముగిసినప్పటికీ నర్సంపేట మండలంలోని రాజుపేట గార్లగడ్డ తండాలో, ముత్యాలమ్మ తండాలో మండలంలో ప్రచారం చేస్తున్నట్లు పెద్ద సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుగులోతు రామస్వామి, నాగవెల్లి వెంకటనారాయణ, నల్ల మనోహర్ రెడ్డి, శివరాత్రి స్వామి, మాజీ ఎంపీపీలు, కౌన్సిలర్లు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply