Tributes | కాటంరాజు మృతి పార్టీకి తీరని లోటు

Tributes | కాటంరాజు మృతి పార్టీకి తీరని లోటు
- మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Tributes | మునుగోడు, ఆంధ్రప్రభ : చెనగోని కాటంరాజు మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డారని, అతని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి(Prabhakar Reddy) అన్నారు. ఈ రోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో పార్టీ కార్యకర్తలతో కలిసి వారి మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని, ఆ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దహన సంస్కారాల(Cremation) నిమిత్తం రూ.50,000లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మందుల సత్యం, సంయుక్త కార్యదర్శి మాదరబోయిన పరమేష్, గజ్జల బాలరాజు గౌడ్, పూల వెంకటేశం, బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
