2many angles | ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

కళాకారుల కోణం
ప్రాంతీయవాదం
రాజకీయ వివాదం
2many angles | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మాణం విగ్రహావిష్కరణ డిసెంబర్ 15న రవీంద్రభారతిలో జరగనుంది. అయితే.. ఈ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అయితే.. రవీంద్రభారతిలో బాలు విగ్రహాన్ని పెట్టడాన్ని కొంత మంది తెలంగాణవాదులు వ్యతిరేకిస్తున్నారు. శుభలేఖ సుధాకర్ తో కొంత మంది తెలంగాణ వాదులు బాలు విగ్రహం పెట్టడం పై అభ్యంతరం వ్యక్తం చేయడం.. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తెలిసిందే. దీంతో మళ్లీ ఆంధ్రా, తెలంగాణ వివాదం వార్తల్లోకి ఎక్కింది. ఈ వివాదం పై సినీ ఇండస్ట్రీ సైలెంట్ గా ఉంది కానీ.. రాజకీయ వర్గాల్లో మాత్రం చర్చ జరుగుతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఈ వివాదం పై తనదైన స్టైల్ లో మాట్లాడడం హాట్ టాపిక్ అయ్యింది.
2many angles | ఇంతకీ.. ఈ వివాదాన్ని ఎలా చూడాలి..? కవిత ఏమని కామెంట్ చేశారు…?

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బహుముఖ ప్రజ్ఞాశాలి. అర్థశతాబ్దానికి పైగా దక్షిణ భారతదేశపు సినీ సంగీత రంగానికి ప్రతినిధిగా నిలిచినవారు. భాషా భేదం లేకుండా దేశంలో ఎన్నో ప్రాంతాల వారు తమ వాడని భావించగల అరుదైన వ్యక్తుల్లో బాలు ఒకరు. అమర గాయకుడు ఘంటసాల ఓ సందర్భంలో తన తర్వాత బాలు మాత్రమే తెలుగు సినీ పాటకు సిసలైన వారసుడు అని చెప్పారు. ఆ జోస్యాన్ని బాలు నిజంగా నిరూపించుకున్నారు. ఘంటసాల తెలుగులో తప్పా వేరే భాషల్లో పాటలు పాడలేదు. బాలు దేశంలోని దాదాపు అన్ని భాషల్లో పాడి లక్షలాది అభిమానులను సంపాదించుకున్నారు.
ఎస్పీ బాలు సంస్మరణార్థం ఆయన నివాసం ఉన్న తమిళనాడులోని నుంగంబాక్కంలోని కాందర్ నగర్ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మాణ్యం రోడ్డు అని పేరు పెట్టారు. దీనికి సంబంధించి 2024లో తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఎస్పీ బాలు పలు భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారని.. పలు చిత్రాలకు సంగీతం అందించారని తెలియచేశారు. అంతే కాకుండా సినిమాల్లో నటించి మెప్పించారు అన్నారు. తమిళ సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలియచేశారు.
తెలుగువాడైన ఎస్పీ బాలును పక్క రాష్ట్రమైన తమిళనాడులో అంతలా గౌరవిస్తుంటే.. తెలుగువాడైనప్పటికీ మన తెలుగు రాష్ట్రంలో ఆయన ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి కాబట్టి తెలంగాణలోని రవీంద్రభారతిలో ఆయన విగ్రహాన్ని పెట్టడం పై కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేయడం పై విమర్శలు వస్తున్నాయి. కళాకారులకు భాషలతో సంబంధం ఉండదు. అన్ని భాషలు వాళ్లు, అన్ని యాసల వాళ్లు అభిమానిస్తుంటారు.. ఆదరిస్తుంటారు. తెలంగాణ ఉద్యమం టైమ్ లో అయితే.. బాలు విగ్రహం పెడుతుంటే ఇలాంటి వివాదం జరగడం ఓకే అనుకోవచ్చు కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇలా మాట్లాడడం ఏంటి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. కళాకారులను ఇలా వేరు చేసి చూడడం.. మాట్లాడడం.. అనేది సరైనది కాదు అంటున్నారు. పాడుతా తీయగా అంటూ ఎంతో మంది గాయనీగాయకుల్ని అందించారు.. అందులో తెలంగాణ వాళ్లు కూడా ఉన్నారు.
రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయనున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో తాను తెలంగాణ వాదులకే మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధక్షరాలు కవిత ప్రకటించారు. ఎస్పీ బాలు విగ్రహం రవీంద్ర భారతి వద్ద పెట్టవద్దని.. దాని కోసం ఇంకేదైనా స్థలం చూసుకోవడం మంచిదని నిర్వాహకులకు కవిత సూచించారు. అంతే కాకుండా రవీంద్ర భారతిలో కేవలం తెలంగాణ కళాకారుల విగ్రహాలు మాత్రమే పెట్టాలని తేల్చిచెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆయన అనుమతి ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఎవరూ కూడా బాలు విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టడం పై వ్యతిరేకంగా మాట్లాడరు. బీఆర్ఎస్ కూడా ఈ వివాదానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. బీజేపీ సీనియర్ నేత మురళీధర్.. ఈ వివాదం పై స్పందించారు. తెలుగువారికి గర్వకారణమైన బాలు గారి విగ్రహం పెట్టడం పై అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదన్నారు.
అయితే.. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రాన్ని ఊపేసిన, ప్రతిఒక్కరిలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన.. జయ జయహే తెలంగాణ.. గీతం పాడమంటే బాలసుబ్రహ్మణ్యం నిరాకరించారని.. అందుకే తెలంగాణ వాదులు బాలు విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టుకోవడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇది నిజంగా నిజమా..? లేక ఎవరైనా కావాలనే ఇలా ప్రచారం చేస్తున్నారా..? అనేది తెలియదు. ఏది ఏమైనా.. కళాకారులకు భాషతో సంబంధం ఉండదు.. ఇది అందరికీ తెలిసిందే. మరి.. ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో..? మిగిలిన రాజకీయ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో..? ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..?
click here to read విజయ్, విక్రమ్ కాంబో ఫిక్స్ అయ్యిందా..?