Campaign trip | మరోసారి అవకాశం ఇవ్వండి
- ప్రజలకు అందుబాటులో ఉంటా
- పోతారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జాగిరి సదానందం
Campaign trip | మంథని, ఆంధ్రప్రభ : సామాజిక మార్పు కావాలంటే సదన్న గెలుపు రావాలని పోతారం గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మంథని మండలం పోతారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జాగిరి సదానందం బరిలో ఉన్నారు. ఇటీవల గ్రామంలో ఆయన ప్రచార యాత్ర విజయ యాత్రల కొనసాగింది. అడుగడుగునా ప్రజలంతా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో ఆయన సతీమణి సర్పంచిగా గ్రామాన్ని అభివృద్ధి చేసిందని ప్రజలంతా చర్చించుకుంటున్నారు. మరోసారి జాగిరి సదన్నకు అవకాశం కల్పిస్తే, సామాజిక మార్పు ఖాయమని ప్రజలు విశ్వసిస్తున్నారు. తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన వివరించారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో పోతారం గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన స్పష్టం చేశారు.

