Indaram | మరింత అభివృద్ధి చేస్తా..

Indaram | మరింత అభివృద్ధి చేస్తా..
Indaram, జైపూర్, ఆంధ్రప్రభ : ఇందారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటి చేస్తున్నాను.. ఆదరించి గెలిపిస్తే.. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు కొరివి శేఖర్. ఇందారం గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలి అన్నారు. ఇందారం గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని.. గ్రామస్థులకు అందుబాటులో ఉంటానని చెప్పారు. గ్రామంలో మౌళిక సదుపాయాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ గ్రామాభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
