Officers | తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ..

Officers | తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ..

  • తెలంగాణ స్పూర్తి తరతరాల పాటు వికసించాలి.,
  • జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్ గోపిడి,

Officers | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్ర‌భ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఈ రోజు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు(Officers), ఉద్యోగులు పాల్గొని జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు.


ఈ సందర్భంగా కలెక్టరేట్ లలో నూతనంగా నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం లతో కలిసి జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్ గోపిడి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రోహిత్ గోపిడి మాట్లాడుతూ…. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం శుభ పరిణామం అన్నారు.

తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, సాంస్కృతిక(cultural) వారసత్వానికి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీకగా నిలుస్తుందని, ప్రజలలో ఐక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధము గా తెలంగాణ తల్లి నిలుస్తుందని, భవిష్యత్ తరాలకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, విలువలను చేరవేయడానికి ఈ విగ్రహం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply