CCTV | గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా..

CCTV | గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా..
- ప్రజలు ఆదరిస్తున్నారు
- పెద్ద ముద్దునూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి
- బొడ్డుపల్లి వరలక్ష్మి
CCTV | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : గెలుపు లక్ష్యంగా ముందుకు సాగుతూ ప్రచారం నిర్వహిస్తున్నామని పెద్దముదునూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా టిఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి బొడ్డుపల్లి వరలక్ష్మి చెప్పారు. నాగర్ కర్నూల్ మండలం పెద్ద ముద్దునూరు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరలక్ష్మి మాట్లాడుతూ… 20ఏళ్లు(20 years)గా ఆశా వర్కర్ గా ప్రతి ఇంటికి వైద్య సేవలు అందించానని, సేవలను గుర్తించి ఈ ఊరి మహిళగా నన్ను ఆదరిస్తున్నారని అందరూ సహకరిస్తున్నారని తనకు గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
15 అంశాలతో కూడిన హామీలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. సర్పంచ్ గా వచ్చే జీతంతో పేద విద్యార్థులకు సేవలందిస్తామని, ఆడపిల్ల పుడితే రూ.2వేలు ఆర్థిక సహాయం అందిస్తామని, అకాల మరణం చెందితే రూ.5వేలు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
రైతులకు ఉచితంగా దసరా కానుకగా ప్రతి సంవత్సరం చీరలు, సీసీ కెమెరాలు(CCTV cameras), సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తామని, యువతకు జిమ్ సెంటర్ చేస్తామని హామీ ఇచ్చారు.
నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ సెంటర్, గ్రంథాలయం, పుస్తకాలు, వైఫై సౌకర్యం(facilities) కల్పిస్తామని, వైకుంఠ రథం ఏర్పాటు చేస్తామని, వైద్య, ఆరోగ్య సేవలు అందిస్తామని, రాజకీయాల కతీతంగా అందరికీ సేవలందించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని వరలక్ష్మి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.
మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మరీ జనార్దన్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు(leaders) హర్షవర్ధన్ రెడ్డి హర్షవర్ధన్ రావు మాజీ జెడ్పిటిసి శ్రీశైలం కురుమూర్తి ఇతర నాయకులు మనకు అండగా ఉండి ప్రచారంలో అన్ని విధాలా ఉండి సహకరిస్తూ గెలుపు కోసం కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. తన గెలుపు కోసం అందరూ కృషిచేసి తమకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
