Bantaram | సల్బత్తాపూర్‌లో వినూత్న రీతిలో ప్రచారం

Bantaram | సల్బత్తాపూర్‌లో వినూత్న రీతిలో ప్రచారం

  • బీసీ బిడ్డను గెలిపించి అభివృద్ధికి బాటలు వేద్దాం

Bantaram | బంటారం, ఆంధ్రప్రభ : బంటారం మండలం సల్బత్తాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచి అభ్యర్థిగా బుర్నాపూర్ బాలయ్య బ్యాట్ గుర్తు ప్రచారం వినూత్న రీతిలో సాగుతుంది. గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని బ్యాట్ గుర్తు చూపిస్తూ పాటలు పాడుతూ వినూత్న పద్ధతిలో ప్రచారం నిర్వహించారు. ప్రతి వార్డు తిరుగుతూ సమస్యలను తెలుసుకుంటూ మీ సమస్యలను తీర్చే బాధ్యత నాది అంటూ భరోసా కల్పిస్తూ ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి బాలయ్య దూసుకుపోతున్నాడు. గ్రామంలో యువకునికి అవకాశం కల్పించి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరిని వేడుకున్నారు.

Bantaram

Leave a Reply