Vallur Bhargav | కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కపట ప్రేమ..

Vallur Bhargav | విజయవాడ, ఆంధ్రప్రభ : విత్తనాల చట్టం 2025 సంవత్సరం పై రాష్ట్ర ప్రభుత్వ నిశ్శబ్దం.. అసమర్థత కాదనీ, పూర్తి సహకారం అందిస్తుందని విజయవాడ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ వల్లూరు భార్గవ్(Vallur Bhargav) అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రాల అధికారాలను కైవసం చేసుకునే, పెద్ద కంపెనీలకు ఎర్రదారి వేస్తూ, రైతులను పూర్తిగా రక్షణ లేకుండా వదిలేస్తున్న డ్రాఫ్ట్ సీడ్స్ బిల్ 2025 పై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం(coalition government) తీసుకున్న వైఖరి ఒకటేనని తెలిపారు.
కేంద్రం అధికార కేంద్రీకరణ కోసం, ధర నియంత్రణ తొలగించడానికి, ఐ కార్, ఎస్ ఏ యూ ఎస్ ను పక్కన పెట్టడానికి, రైతులకు నష్టపరిహారం హక్కును ఇవ్వకుండా బిల్‌ను ముందుకు తీసుకెళ్తుందన్నారు. రైతుల కోసం పోరాడతామని ప్రతీరోజూ హర్వర్డ్ లెక్చర్(Harvard Lecture)లా మాట్లాడే కూటమి ప్రభుత్వం, ప్రస్తుతం మాట కూడా పలకకుండా ఉండటం ఏమిటనీ ప్రశ్నించారు? ఇది పరిపాలనా వైఫల్యం కాదుని, ఇది అవగాహన లోపం కూడా కాదనీ, కేవలం రాజకీయ లొంగుబాటు(Political surrender) మాత్రమే అని ఆయన విమర్శించారు. రాష్ట్రాల అధికారం మీద నేరుగా కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుంటే… ఈ దాడికి రాష్ట్ర ప్రభుత్వం ఎదురు నిలబడటం బదులు తలవంచి నిలబడటానికి సిద్ధమవుతోందనీ ఆరోపించారు.
రైతుల పోరాటాలను, హక్కులను కాలరాయడమే ధ్యేయంగా ప్రభుత్వాలు పని చేయడం దారుణం అన్నారు. రైతుల హక్కుల కోసం ఏ మాత్రం ఆలోచించకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చెప్పినట్టు చేయడానికే ఆసక్తి చూపుతోందన్నారు. విత్తనాల వైఫల్యం(Seed failure)తో రైతు నష్టపోతే నష్టపరిహారం లేదనీ, విత్తనాల ధరలు పెరిగినా, నియంత్రణ లేదన్నారు. చిన్న రైతులు, చిన్న విత్తన సంస్థలు బయటకు నెట్టబడతారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు మాత్రం పూర్తి స్వేచ్ఛ(Complete freedom) లభిస్తుందన్నారు. ఇలాంటి నిశ్శబ్దాన్ని చరిత్ర క్షమించదనీ, రైతులు అయితే అస్సలు క్షమించరు అన్నారు.
