Cricket | బ్లైండ్ టీమ్ కెప్టెన్ దీపికకు నీరాజనం

Cricket | బ్లైండ్ టీమ్ కెప్టెన్ దీపికకు నీరాజనం

  • మడకశిరలో పండుగే పండుగ

Cricket | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : దేశ గర్వంగా నిలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టు(Cricket team) కెప్టెన్ దీపికకు మడకశిర పట్టణం సోమవారం ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా పట్టణం అంతా పండుగ వాతావరణంతో సందడి చేసింది. పట్టణ వీధుల గుండా నిర్వహించిన భారీ ర్యాలీలో మహిళలు, యువత, క్రీడాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎస్. సవిత, ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు , పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి(MLA Palle Sindhura Reddy), మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ప్రముఖ సినీ నటులు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్, అలాగే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు(fans) హాజరై దీపికకు ఘనంగా అభినందనలు తెలియజేశారు. అంధ మహిళల క్రికెట్‌లో దేశానికి గర్వకారణమైన విజయాలు సాధించిన దీపికను నాయకులు, అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు.

Leave a Reply