TDP | ప్రజల బాధలను చూడలేక…

TDP | ప్రజల బాధలను చూడలేక…
టీడీపీ నాయకులు సొంత నిధులతో రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు..
TDP | నంద్యాల బ్యూరో, ఆంధ్ర ప్రభ : ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకు అన్న చందంగా టిడిపి(TDP) నాయకులు నంద్యాల నుంచి చాబోలు, సంబవరం రహదారి గుండా వెళ్లే ప్రయాణికుల ప్రజల ఇబ్బందులను చూడలేక సొంత నిధులతో రోడ్డుకు మరమ్మత్తులు చేసిన సంఘటన నంద్యాల సొంత నిధులతోజిల్లాలో చోటుచేసుకుంది.నంద్యాల మండలం చాబోలు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు తమ సొంత నిధులు వెచ్చించి చాబోలు నుంచి నంద్యాల వరకు ఉన్న సుమారు నాలుగు కిలోమీటర్ల రోడ్డుకు సోమవారం మరమ్మతులు చేపట్టారు.
నంద్యాల (Nandyal) చాబోలు రోడ్డు పూర్తిగా శిద్ధిలావస్థకు చేరుకొని వాహన దారులు గత మూడేళ్లుగా తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్నారు.రోడ్డు బాగుచేసి వాహనదారుల కష్టాలు తొలగించాలని ఉమ్మడి ప్రభుత్వంకు విన్నవించరు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర న్యాయశాఖ, మైనారటి సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ లు స్పందించరు. వారి ఆదేశాల మేరకు నంద్యాల చాబోలు రోడ్డు అద్వాన్న దుస్థితి, పరిస్థితిని చూసి స్పందించిన చాబోలు గ్రామ టిడిపి నాయకులు, నంద్యాల కేసి కెనాల్ డిస్ట్రబ్యూటరీ కమిటీ చైర్మన్ ముల్లా ఇలియాజ్, గ్రామ టీడీపీ నాయకులు ముల్లా ఇబ్రహీం మౌలాన, టీడీపీ యువ నాయకులు ముల్లా అజీజ్ లు స్పందించరు.

ప్రతిరోజు వాహనదారులు ప్రజలు పడుతున్న ఇబ్బందులను (Problems) గుర్తించి తమ సొంత నిధులతో రోడ్డు మురమత్తు పనులు చేపట్టారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల కంచెలను తొలగించి శుభ్రం చేశారు. రాష్ట్ర మంత్రి సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని టిడిపి మైనార్టీ నాయకులు ఇబ్రహీం., మౌలానా తెలిపారు. రోడ్డుకు మరమ్మతులు చేసి వాహన దారుల కష్టాలు తీర్చిన మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ ను, చాబోలు టీడీపీ నాయకుల బృందాన్ని చాబోలు, చాబోలు టెక్కె, సాంబవరం గ్రామ ప్రజలు అభినందించారు.
